Introduction
Communication Skills infographics present information on important communication skills, topics, and concepts in a concise and visual format. They help learners quickly understand key points without reading lengthy articles. These infographics are especially useful for academic and competitive exam preparation, and for daily conversations, making learning both quick and effective.
This infographic explains the six steps to improve one’s communication skills, using simple language and suitable examples.
కమ్యూనికేషన్ నైపుణ్యాల ఇన్ఫోగ్రాఫిక్స్ ముఖ్యమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అంశాలు మరియు భావనల గురించిన సమాచారాన్ని సంక్షిప్త మరియు దృశ్య రూపంలో అందిస్తాయి. ఇవి అభ్యాసకులు సుదీర్ఘమైన వ్యాసాలు చదవకుండానే ముఖ్యమైన విషయాలను త్వరగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ ముఖ్యంగా విద్యా మరియు పోటీ పరీక్షల తయారీకి, మరియు రోజువారీ సంభాషణలకు ఉపయోగపడతాయి, తద్వారా నేర్చుకోవడం వేగంగా మరియు ప్రభావవంతంగా మారుతుంది.
ఈ ఇన్ఫోగ్రాఫిక్, సులభమైన భాష మరియు తగిన ఉదాహరణలను ఉపయోగించి, ఒకరి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి గల ఆరు దశలను, చర్యలను వివరిస్తుంది.
How to Use this Infographic?
First, look at the entire infographic without reading every detail. This helps your brain understand what topic you are learning before diving into details.
Now, read all the infographic sections carefully and understand the different steps to improve communication skills.
మొదట, ప్రతి వివరమూ చదవకుండా మొత్తం ఇన్ఫోగ్రాఫిక్‌ను చూడండి. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏ అంశాన్ని నేర్చుకుంటున్నారో మీ మెదడుకు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ఇప్పుడు, ఇన్ఫోగ్రాఫిక్‌లోని అన్ని విభాగాలను జాగ్రత్తగా చదివి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి గల వివిధ దశలను అర్థం చేసుకోండి.
Click on the image for a bigger view.
Communication Skills infographics are perfect revision tools. Review them before exams, before classroom lectures, before writing articles, and before presentations. Just 5 minutes of revision can refresh an entire topic.
Use Communication Skills infographics for understanding and revision, not memorization alone.
When visuals, examples, and practice come together, reading about Communication Skills become easy and enjoyable.
కమ్యూనికేషన్ నైపుణ్యాల ఇన్ఫోగ్రాఫిక్స్ పునశ్చరణకు సరైన సాధనాలు. పరీక్షలకు ముందు, తరగతి గది ఉపన్యాసాలకు ముందు, వ్యాసాలు రాసే ముందు మరియు ప్రజెంటేషన్లకు ముందు వీటిని సమీక్షించండి. కేవలం 5 నిమిషాల పునశ్చరణ ఒక మొత్తం అంశాన్ని గుర్తుకు తెస్తుంది.
కమ్యూనికేషన్ నైపుణ్యాల ఇన్ఫోగ్రాఫిక్స్‌ను కేవలం బట్టి పట్టడానికి కాకుండా, అర్థం చేసుకోవడానికి మరియు పునశ్చరణకు ఉపయోగించండి.
దృశ్యాలు, ఉదాహరణలు మరియు అభ్యాసం కలిసినప్పుడు, భావప్రసార నైపుణ్యాల గురించి చదవడం సులభంగా మరియు ఆనందదాయకంగా మారుతుంది.
6 Steps to Improve Communication Skills
1. Listen Actively (శ్రద్దగా వినండి)
- Pay attention to the speaker without interrupting (అంతరాయం కలిగించకుండా స్పీకర్ చెప్పేది వినండి)
- Show that you are listening by nodding (తల ఊపడం ద్వారా మీరు వింటున్నారని చూపించండి)
- Maintain eye contact (కళ్ళలోకి చూస్తూ ఉండండి)
- Ask relevant questions (సంబంధిత ప్రశ్నలు అడగండి)
- Summarize/repeat key points (ముఖ్యాంశాలను చెప్పండి, పునరావృతం చేయండి)
- Understand the message correctly (సందేశం సరిగ్గా అర్థం చేసుకోండి)
2. Speak Clearly (స్పష్టంగా మాట్లాడండి)
- Organize your thoughts (మీ ఆలోచనలను క్రమపరచుకోండి)
- Use simple and precise words (సరళమైన, ఖచ్చితమైన పదాలను ఉపయోగించండి)
- Avoid using long sentences (పొడవైన వాక్యాలను ఉపయోగించడం మానుకోండి)
- Maintain a steady pace (స్థిరమైన వేగాన్ని కొనసాగించండి)
- Use proper pronunciation (సరైన ఉచ్చారణను ఉపయోగించండి)
3. Use Body Language (బాడీ లాంగ్వేజ్ ను ఉపయోగించండి)
- Maintain eye contact (కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి)
- Maintain confident posture (ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసే భంగిమను కొనసాగించండి)
- Use appropriate facial expressions (ముఖ కవళికలు తగిన విధంగా ఉపయోగించండి)
- Use hand gestures (చేతి సంజ్ఞలను ఉపయోగించండి)
- Body language should match with your words (శరీర భాష మీ మాటలకు అనుగుణంగా ఉండాలి)
4. Grow Your Vocabulary (మీ పదజాలాన్ని పెంచుకోండి)
- Learn new words regularly (కొత్త పదాలను క్రమం తప్పకుండా నేర్చుకోండి)
- Read books, articles, and quality content (పుస్తకాలు, కథనాలు, నాణ్యమైన కంటెంట్ ను చదవండి)
- Watch movies, videos for correct pronunciation (సరైన ఉచ్చారణ కోసం సినిమాలు, వీడియోలను చూడండి)
- Practice using new words (కొత్త పదాలను ఉపయోగించడం సాధన చేయండి)
- Vocabulary helps you express ideas accurately (మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తీకరించడానికి పదజాలం మీకు సహాయపడుతుంది)
5. Be Empathetic with Others (ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండండి)
- Understand the feelings of others (ఇతరుల భావాలను అర్థం చేసుకోండి)
- Understand their perspectives (ఇతరుల దృక్కోణాలను అర్థం చేసుకోండి)
- Show respect and patience (గౌరవం, సహనం చూపించండి)
- Share your thoughts/concerns (మీ ఆలోచనలు, సందేహాలను పంచుకోండి)
- Let them share their thoughts/concerns (వారు తమ ఆలోచనలు, ఆందోళనలను చెప్పనివ్వండి)
- Respond in a supportive/considerate way (సహాయకరమైన/సానుభూతిగల రీతిలో ప్రతిస్పందించండి)
- Build stronger relationships with others (ఇతరులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోండి)
6. Handle Feedback Well (ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించండి)
- Receive feedback with open mind (విశాల దృక్పథంతో అభిప్రాయాన్ని స్వీకరించండి)
- Avoid becoming defensive (రక్షణాత్మకంగా ఉండడం మానుకోండి)
- View criticism as an opportunity (విమర్శను ఒక అవకాశంగా భావించండి)
- Improve your communication skills (మీ సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి)
- Thank the person for feedback (అభిప్రాయానికి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పండి)
- Apply useful suggestions (ఉపయోగకరమైన సూచనలను వర్తింపజేయండి)
Infographic
Also read: Sentence Formation in English.